లవ్ ఇన్ షాపింగ్ మాల్ సినిమా (ఇది రివ్యూ కాదు)

ఎన్నో రోజులనుంచి చూడాలి చూడాలి అనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చిన చిత్రం ఎట్టకేలకు నిన్న రాత్రి చూసాను. సినిమా నాకు మాత్రం చాల బాగా నచ్చింది (నాకు సినిమా చుస్తునటుగా కాక ఏదో తేలియన అనుభూతి కల్గింది.) మనం రోజు కలిసే లేక చూసే మనుషుల్లోనే మనకు తెలియని ఎంతో జీవితం వుంటుంది. ఆ వ్యక్తులు షాపింగ్ మాల్ల్స్ లో సేల్స్ వాళ్ళే కావొచ్చు లేక హోటల్ లో పని చేసే వాళ్ళే కావొచ్చు లేక సముద్రంలో చేపలు పట్టే వాళ్ళే కావొచ్చు. ఇటు వంటి మనకు తేలియన (కనీసం నాకు తెలియని) అంశాన్ని ముఖ్యమయినధిగా తీసుకొని సినిమా చాల బాగా తీసారు.
ఈ సినిమా నాకు బాగా నచ్చడానికి ఒక ముఖ్య కారణం, డిగ్రీ చదివే రోజుల్లో , శని , ఆది వారాల్లో 100 రూపాయల కోసం స్టార్ హోటళ్ళలో (5 , 4 , 3 స్టార్ ) 12 గంటలు పనిచేసేవాళ్ళం. మొత్తం పనిగంటల్లో కనీసం కూర్చోటానికి కూడా సమయం వుండేది కాదు. అంత సేపు నిలబడి పనిచేసేటప్పుడు కొన్ని సార్లు కళ్ళు కూడా తిరిగేవి. ఐన సరే అలాగే చేసేవాళ్ళం. మధ్యాన్నం 3 గంటలకు వెళ్లి తెల్లవారు జామున 3 గంటలకు వచ్చే వాళ్ళం. ఇక రూం కి వచ్చే సరికి వళ్ళంత ఒకటే నొప్పులు. కానీ ఇదంతా మేము వారానికి ఒక రోజో లేక రెండు రోజులో చేసే వాళ్ళం. అదీ కాకుండా మాకు వెళ్లక పోయిన పర్వాలేదు (ఇంట్లో వాళ్ళు బాగానే సంపాయించి పెట్టారు) , అదే వెళ్ళటం తప్పనిసరి అయిన వాళ్ళ పరిస్థితి వుహించలేము. వాళ్ళకు చదువుకోవాలన్న వేసులుబట్టు ఉండదు, వేరొక పని రాదూ , తప్పక ఇదే పని చేస్తూ వుండాలి. ఇక వాళ్ళ పరిస్థితి వర్ణనానీతం.

గత కొన్ని రోజులుగా మదిలో ఎన్నో సందేహాలు మరియు రకరకాల ఆలోచనలు కల్గుతున్నాయి. అసలు ఈ సమాజంలో ఒక ప్రక్క పేద వారు ఎందుకు ఇంకా పేద వారుగా మారుతున్నారు మరియు ఇంకో ప్రక్క ధనవంతులు ఇంకా ధనవంతులుగా ఎందుకు మారుతున్నారు. ఇక్కడ ఇన్ని వ్యతాసాలు , తారతమ్యాలు ఎందుకు పెరిగిపోతున్నాయి (ఇవి పురాతన కాలం నుండి వున్నవే, అయిన ఈ మధ్య ఈ వ్యతాసాలు విపరీతంగా పెరిగిపోత్హునాయి అని నా అభిప్రాయం.) వీటన్నింటికి ముల కారణాలు ఎక్కడ వున్నాయి(అలా అని ఈ సమస్యలకు నేనేదో పరిష్కారాలు కనుక్కుంటాను అని కాదు, కానీ తెలుసుకోవటం కనీస నా బాధ్యత అనుకుంటున్నాను).
రోజు రోజుకి ఈ విషయాలు తెలుసుకోవాలి అనే కోరిక పెర్గుతుండగా వీటి గురుంచి చదవటం ప్రారంబించాను. పుస్తకాల్లో , వార్త పత్రిక సంపాదకీయాల్లో ఇంకా మాస పత్రికల్లో విషయాలు చదువుతూ అసలు అన్ని పనులు ఎలా జరుగుతాయో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తునాను.

ఈ మధ్య చదివిన ఒక పుస్తకం confession of an economic hitman . ఇందులో రచయిత అమెరికా దేశ ప్రభుత్వం మరియు పెద్హ పెద్హ కంపెనీ వాళ్ళు కలిసి , చిన్న చిన్న దేశాలనుంచి ఎలా సహజ వనరులను దోచుకుంటారో , ఇందుకు కోసం అమెరికా ప్రభుత్వమే అనదికారంగా ఈ హిట్ మాన్ అనే టీం వాళ్ళని ఎలా తాయారు చేసి పోషిస్తారో చాలా విపులంగా విశదీకరించారు. (రచయిత కూడా ఒక హిట్ మాన్ గ పనిచేసిన వ్యక్తి)

పీ. సునీల్ కుమార్ రెడ్డి గారు “గంగ పుత్రులు ” సినిమాలో కొన్ని పెద్హ కంపెనీలు (మన దేశానివే) ,వాటి వ్యాపారాల కోసం చిన్న చిన్న వ్యాపారస్తులని ఎలా చిన్నా బిన్నం చేస్తారో (mega supermarkets) , మరియు సహజ వనరులని దోచుకొని వాటి మీద ఆధారపడి బ్రతికే వారికీ ఎలా జీవనాధారం లేకుండా చేస్తారో(over fishing ) , అందరికి అర్ధం అయ్యేలా చాల బాగా చూపించారు.

ఇంకా ఇవే కాకుండా మరో ప్రక్క రైతులనుంచి పొలాలను లాక్కొని వారి జీవనాధారాన్ని పోగొట్టి , ఆ స్థలాలను గ్లొబలిజతిఒన్ పేరుతో బడా వ్యాపారస్తులకు చవుకగా కట్ట బెడుతున్నారు. ఒక 100 మంది నుంచి స్థలాలు తీసుకొని ఏదో మొక్కుబడిగా కొంత మందికి పని ఇచ్చి చేతులు దులిపెశుకున్ట్టున్నారు. ఇది కూడా ఒక రకమైన అభివృధ్హి. చివరకు ఎవరికీ వ్యక్తిగతంగా చిన్న చిన్న వ్యాపారాలు లేకుండా మరియు స్థలాలు కుడా లేకుండా అందర్ని ఈ బాద వ్యాపారస్తులు దగ్గిర పనిచేసేలా చేసుకుంటున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాల వుంది.

మరల ఎమన్నా అంటే రాజకీయ నాయకులూ మరియు పెద్హ వ్యాపారస్తులు దీన్నే అభివృధ్హి అంటారు.

నాకు ఇప్పుటకి అంతుచిక్క లేదు ,ఇంతకు అసలు అభివృధ్హి అంటే ఏమిటి?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s